ఆ ఘటన తర్వాతే.. రోహిత్ శర్మలో మార్పు వచ్చింది : మాజీ ప్లేయర్

praveen
టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అందరిలాగా ఒక సాదాసీదా క్రికెటర్ గానే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రోహిత్.. ఏకంగా తన ప్రదర్శనతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. అంతే కాదు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా హిట్ మాన్ గా మారిపోయాడు. అంతేకాదు ఎంతో మంది ప్రేక్షకులకు డబల్ సెంచరీల వీరుడిగా కూడా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ.

 అయితే కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్గా తన సత్తా ఏంటో అన్నది ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఏకంగా ఐదు టైటిల్స్ అందించడమే కాదు టీమ్ ఇండియాని కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా స్టార్ ప్లేయర్గా ఎదిగిన రోహిత్ శర్మకు ధోని కెప్టెన్సీ లో టీమిండియా గెలిచినా.. 2011 వరల్డ్ కప్ సమయంలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు అని చెప్పాలి. ఇలా వరల్డ్ కప్ లో రోహిత్ సెలెక్ట్ అవ్వని సమయంలో అతను ఏం చేశాడు అనే విషయంపై మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 2011లో వరల్డ్ కప్ లో సెలెక్ట్ అవ్వకపోవడం రోహిత్ శర్మలో చాలా మార్పు తీసుకొచ్చింది అంటూ అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చారు. సాధారణంగా రోహిత్ శర్మను గిఫ్ట్ ప్లేయర్ అని అందరూ అంటూ ఉంటారు. కానీ అతను చేసే హార్డ్ వర్క్ చాలామంది చేయలేరు. 2011 వరల్డ్ కప్ కి ఎంపిక కానప్పుడు నా దగ్గరికి వచ్చి అతను మాట్లాడాడు. నేను చాలా చేయాలి. కొత్త రోహిత్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలి. దీనికోసం ఇంకా కష్టపడాలి అంటూ రోహిత్ నాతో చెప్పాడు. ఆ తర్వాత ఇక హిట్ మ్యాన్ అవతారం ఎత్తాడు అంటూ అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత అటు రోహిత్ శర్మ ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత జరిగిన అన్ని వరల్డ్ కప్లలో కూడా అతనికి స్థానం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: