హెడ్ కోచ్ గా.. అతనైతే బెటర్ : గంగూలీ

praveen
ప్రస్తుతం టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.  ఎందుకంటే ప్రస్తుతం హెడ్ కోచ్గా పని చేస్తున్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలంతో ముగియటంతో బీసీసీఐ పెద్దలు కొత్త హెడ్ కోచ్ ను ఎంపిక చేసే పనిలో బిజీ బిజీ అయ్యారు.  ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ పెద్దలు కోచ్ కి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ఎంతో మంది పేర్లు తెరమీదకి వచ్చాయి. వీళ్ళే భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్గా రాబోతున్నారు అంటూ వార్తలు తెరమీదకి రాగా.. చివరికి గౌతమ్ గంభీర్ ని ఫైనల్ చేశారంట మరికొన్ని వార్తలు వచ్చాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది.

 కానీ ఆ తర్వాత హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు అటు గౌతమ్ గంభీర్ కు ఇంట్రెస్ట్ లేదని ఇక ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును సక్సెస్ఫుల్ టీం గా నిలబెట్టడమే తన లక్ష్యం అంటూ గౌతమ్ గంబీర్ చేసిన వ్యాఖ్యలతో అందరికీ అర్థమైంది. దీంతో టీమిండియా కు కొత్త హెడ్ కోచ్గా ఎవరూ రాబోతున్నారు అనే విషయంపై మరింత సందిగ్ధత నెలకొంది. అని చెప్పాలి. అయితే ఇదే విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సౌరబ్ గంగూలీని ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గా భారతీయుడే ఉండాలని అన్నాడు.

 ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన కోచ్ లు ఉన్నారు. తమ ఆటతో భారత క్రికెట్లో అద్భుతాలు చేసిన ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ జట్టులో భాగం అవ్వాలి. అది భారత క్రికెట్ కే మంచిది అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. భారత కోచ్గా గంభీర్ ఎంపికైతే అతను అత్యుత్తమ కోచ్ గా నిలుస్తాడు   అతను టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడా లేదా అన్నది నాకు తెలియదు. దరఖాస్తు చేసుకుంటేనే ఇతను టీమిండియా హెడ్ కోచ్గా ఎంపిక అవుతాడు అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: