ఎట్టకేలకు..హీరోయిన్ క్షమాపణలు చెప్పిన జెసి ప్రభాకర్ రెడ్డి..కాని..?

Divya
రెడ్డి నటి బిజెపి నేతగా పేరుపొందిన మాధవి లతా పైన చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాను చేసిన ఈ వాక్యాలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటూ ఒక కీలకమైన ప్రకటన చేశారు. తాను ఆవేశంలో మాట్లాడేనే తప్ప ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ జేసి దివాకర్ రెడ్డి వెల్లడించడం జరిగింది.. తాను  ఆమెకు సారీ కూడా చెబుతున్నానంటూ వెల్లడించారు. ఇటీవలే తాను ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది.

డిసెంబర్ 31 న తనని నమ్మి 16 వేల మంది అక్క, చెల్లెమ్మలు జెసి పార్కుకి రావడం జరిగిందని తన గురించి మాట్లాడిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లెక్సీ గాళ్లే అంటూ తెలియజేయడం జరిగింది.. తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తాను రెండేళ్లలో తాడిపత్రి రూపురేఖలను మార్చే మాట్లాడతాను అంటూ తెలిపారు. తాను ఎప్పటికీ పార్టీ మారనని తెలిపారు.
అయినప్పటికీ హీరోయిన్ మాధవి లత సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. అసలు విషయంలోకి వెళ్తే చాలా తాను ప్రయత్నం చేశానని కానీ తాను మనిషినేనా నాకు ఆత్మగౌరవం ఉంటుంది కదా తనకున్న బాధను వర్ణించలెననీ.. ప్రతిక్షణం కూడా వేదన తో కోపం నిరాశ ఆవేదన దుఃఖంతో ఒకేసారి తనను కుదిపేస్తున్నాయని.. చాలాసార్లు చాలా మంది తన ఆత్మవిశ్వాసాన్ని సైతం చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు.పదేపదే అదే మాటలతో అంటున్న ఎవరు వస్తారని ఎప్పుడు వస్తారని ఆశపడలేదు సమాజం కోసమే తాను అనుకున్న.. నా పార్టీ కోసం మహిళల కోసం హిందూ ధర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని.. ఏనాడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. మరి ఇకనైనా ఈ విషయానికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: