రామ్ చరణ్ నటించిన సినిమాలలో..బాలయ్య వందసార్లు చూసినా మూవీ ఏంటో తెలుసా..?

Thota Jaya Madhuri
"బాలయ్య".. ఓ పెద్ద సినిమా హీరో. ఆ విషయం అందరికీ తెలుసు . ఎంతలా అంటే కోట్లల్లోనే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనను ఒక హీరోలా కాకుండా.. ఒక పొలిటిషియన్ గా కూడా కాకుండా.. ఒక మంచి మనిషిగా అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. బాలయ్య కోప్పడిన సరే పెద్దగా ఆ విషయాలను పట్టించుకోరు . కాగా రీసెంట్గా బాలయ్య కు సంబంధించిన ఒక వార్త సినీ వర్గాలల్లో బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య తనలోని డిఫరెంట్ యాంగిల్ ను బయటపడుతూ తనలో దాగి ఉన్న హోస్ట్ ని బయటకు రప్పించాడు .
ఆహా ప్లాట్ ఫామ్ ద్వారా అన్ స్టాపబుల్ షో ని హోస్స్ట్ చేస్తున్నారు. ఈ షోకి చాలామంది గెస్ట్లు వచ్చారు . తాజాగా "గేమ్ చేంజర్" సినీ ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ షో కి హాజరయ్యాడు . నిజానికి రామ్ చరణ్ ని ఎప్పుడో ఈ షో కి రప్పించాలి అని ట్రై చేశాడు అల్లు అరవింద్ కానీ కుదరలేదు. కానీ ఇన్నాళ్లకి కుదిరింది.  రీసెంట్ గానే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది .
ప్రోమోలో రాంచరణ్ మాట్లాడిన మాటలు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి . మరి ముఖ్యంగా బాలయ్య ప్రవర్తించిన తీరు మెగా ఫాన్స్ కి కూడా బాగా నచ్చేసింది . రాంచరణ్ పర్సనల్ విషయాలను కూడా అడిగి తెలుసుకున్నాడు బాలయ్య. ఇదే మూమెంట్లో రామ్ చరణ్ నటించిన సినిమాలలో బాలయ్య మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏది అనే విషయం బయటపడింది. రామ్ చరణ్ నటించిన "మగధీర" సినిమా అంటే బాలయ్య బాగా బాగా ఇష్టం అంటూ తెలుస్తుంది . అంతేకాదు దాదాపు 100 సార్లు పైగానే .. ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేశారట . ఆ సినిమాలో ముఖ్యంగా హార్స్ రైడింగ్ మూమెంట్లో ఆ సీన్స్ ఎక్కువగా లైక్ చేసేవారట . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: