దీపావళి ధమాకా..."క" సినిమాతో చెప్పి మరీ అబ్బవరం హిట్ కొట్టాడు ?
మొదట కిరణ్ అబ్బవరం సినిమా ఏముంటుందిలే అని అందరూ అనుకున్నారు. కానీ దీపావళి పండుగ సందర్భంగా విడుదలై... లక్ష్మీ బాంబుల బాక్స్ ఆఫీస్ ముందు పేలింది. ఈ సినిమా అంచనాలను మించి.. హిట్ అందుకుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ సందర్భంగా నే హీరో కిరణ్ అబ్బవరం ఇదే వ్యాఖ్యలు చేశారు. సినిమా హిట్ కాకపోతే.. ఇకపైన ఇండస్ట్రీ మొఖం కూడా చూడనని శపథం చేశారు కిరణ్ అబ్బవరం.
ఈ సినిమా మొత్తం క్రిష్ణగిరి అనే గ్రామంలో జరిగింది. అక్కడ తొందరగా చీకటి పడుతుంది. ఆ సమయంలో గ్రామంలో ఉన్న అమ్మాయిల కిడ్నాప్ చేస్తూ ఉంటారు. అలా అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు తరలిస్తూ ఉంటారు. అయితే.. ఆ కిడ్నాప్ లను హీరో ఎలా కట్టడి చేస్తాడు అనేదే సినిమా స్టోరీ. ఇక ఈ సినిమాను దాదాపు 20 కోట్లతో తీస్తే... 70 నుంచి 80 కోట్ల వరకు వచ్చాయట. ఇంత చిన్న సినిమాను... ప్రేక్షకులు ఆదరించి.. థియేటర్లలో చూడగలిగారు.
అలాగే ఐ ఎం డి బి లో 10 పాయింట్లకు గాను దాదాపు 7.5 రేటింగ్ ఇవ్వడం మనం చూసాం. అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా కాస్త చిక్కులు ఉన్నప్పటికీ... ఆ తర్వాత క్లారిటీగా ఉంటుంది. దీంతో సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా పార్ట్ 2 కూడా త్వరలో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈటీవీ విన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.