దేవుడి పేరుతో దోచుకుంటున్నారా?.. స్వామీజీ హాట్‌ కామెంట్స్‌?

Chakravarthi Kalyan
దేవాలయంలో ఒక దేవుడుంటే హుండీలు 20 పెడుతున్నారని.. హుండీలు పెట్టి భక్తులను దోచుకుంటున్నారని కమలానంద భారతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే దేవాదాయ శాఖను రద్దు చేయాలని కమలానంద భారతి స్వామి డిమాండ్ చేశారు. మనం నిర్మించుకున్న ఆలయాల పై ప్రభుత్వాల పెత్తనమేంటని ప్రశ్నించిన కమలానంద భారతి స్వామి.. సినిమాలకు మాదిరి కౌంటర్లు, టిక్కెట్లు పెట్టి ఆలయాల్లో దైవదర్శనాన్ని అమ్ముకుంటున్నారని విమర్శించారు.

దేవాదాయ, ధర్మాదాయ శాఖ దుర్మార్గమైనదని.. ఏపీ రాష్ట్రంలోని దేవాలయాల బోర్డుల్లో హిందూ అనే పదాన్ని తీసేశారని.. హిందూ సమాజమంతా దేవాలయాలను ప్రశ్నించాలని కమలానంద భారతి స్వామి పిలుపు ఇచ్చారు. ప్రభుత్వమే దేవాలయాల భూములను కబ్జా చేసి ప్రభుత్వ కార్యాలయాలు, గోడౌన్లు నిర్మించిందన్న కమలానంద భారతి స్వామి.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
దశావతారాల్లో ఏడు అవతారాల ఆలయాలు ఉన్నది ఏపీ రాష్ట్రంలోనేనని.. అందుకే ఏపీని రాష్ట్ర ప్రభుత్వం దేవభూమిగా ప్రకటించాలని కమలానంద భారతి స్వామి డిమాండ్ చేశారు. ఏడు అవతారాల ఆలయాలను కలుపుతూ కారిడార్ ఏర్పాటు చేయాలని కమలానంద భారతి స్వామి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: