ఐపీఎల్ చరిత్రలో.. ఫైనల్లో అతి తక్కువ స్కోరు ఇదే?
అయితే గతంలో హైదరాబాద్ జట్టుకు రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కెప్టెన్ గా ఉన్న సమయంలోనే ఐపిఎల్ టైటిల్ దక్కింది. దక్కన్ చార్జెర్స్ అనే పేరు ఉన్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు కెప్టెన్గా ఉన్నప్పుడు టైటిల్ విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టు.. ఇక డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో మరోసారి టైటిల్ గెలిచింది. అయితే ఇప్పుడు మరోసారి అటు ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ కెప్టెన్ గా ఉండడంతో టైటిల్ తప్పకుండా గెలుస్తుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఫైనల్ వరకు దూసుకుపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ ఊహించని రీతిలో ఫైనల్లో కోల్కతా జట్టు చేతిలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది అని చెప్పాలి.
లీగ్ దశ వరకు కూడా అద్భుతంగా రాణిస్తూ వచ్చిన సన్రైజర్స్ జట్టు అటు నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం తేలిపోతూ వచ్చింది ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా చెత్త ప్రదర్శన చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 113 పరుగులకే పరిమితమైంది సన్రైజర్స్. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్లో ఇదే అతి తక్కువ స్కోరు కావడం గమనార్హం. 2013లో చెన్నై ముంబై పై 125/9, 2017లో పూనేతో మ్యాచ్లో ముంబై 129/8 పరుగులకే పరిమితమైనది. కానీ ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం 113 పరుగులకే పరిమితం కావడం గమనార్హం.