రోహిత్ కు షాకీచ్చిన బాబర్.. ఆ రికార్డు లాగేసుకున్నాడుగా?

praveen
టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లదే అదిపత్యం అని చెబుతూ ఉంటారు విశ్లేషకులు. కానీ ఇక పొట్టి ఫార్మట్ లో బ్యాటింగ్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. సాధారణంగా అయితే మిగతా ఫార్మట్ లలో బ్యాట్స్మెన్ లకు క్రీజులో కుదురుకునేందుకు అవకాశం ఉంటుంది. క్రీజు పరిస్థితి ఎలా ఉంది బంతి ఎలా వస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు కొంతసమయం ఉంటుంది. కానీ టి20 ఫార్మాట్లో మాత్రం అలా ఉండదు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోవాల్సి ఉంటుంది.

ఇక తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ప్రతి బ్యాట్స్మెన్ బ్యాట్ పట్టుకుని మైదానంలో బరిలోకి దిగుతూ ఉంటాడు. అయితే ఇలాంటి సమయంలో అటు బౌలర్లు వేసే వైవిధ్యమైన బంతులు ఎదుర్కొని పరుగులు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.. అందుకే కొంతమంది బ్యాట్స్మెన్లు పొట్టి ఫార్మాట్లో ఎక్కువగా విఫలమవడం కూడా చూస్తూ ఉంటాం. కేవలం కొంతమంది మాత్రమేమంచి ప్రదర్శన చేస్తూ ఇక ఎప్పుడూ రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు  అయితే ఇలా పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఆటగాల్లుగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఒకరు అని చెప్పాలి.

 ఇక ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్లో ఈ ముగ్గురు క్రికెటర్లు ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించారు. అయితే ఇటీవల పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో బాబర్ అజాం ఏకంగా రోహిత్ శర్మను దాటేశాడు. 3987 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు సెకండ్ ప్లేస్ లో ఉన్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడవ స్థానానికి పడిపోయాడు. కాగా రోహిత్ 3974 పరుగులతో ఉన్నాడు. ఇక మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ 4037 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో.. ఈ ముగ్గురు క్రికెటర్లు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే ఛాన్సులు లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: