ఐ పీ ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. రేపటి నుండి ప్లే ఆప్స్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. అందులో భాగంగా ఈ సారి ప్లే ఆప్స్ లోకి కోల్కతా నైట్ రైడర్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వెళ్లాయి. ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ మ్యాచ్ ముందు వరకు ఎవరు అయితే ఇందులో గెలుపొందుతారో వారే ప్లే ఆప్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కొంచెం అటు ఇటుగా చెన్నై సూపర్ కింగ్స్ ఓడినా కానీ ప్లే ఆఫ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే బెంగళూరు జట్టు చెన్నై జట్టును భారీ తేడాతో ఓడ గోట్టి ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడు అయినటువంటి ఎంఎ స్ ధోని , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని పలు విమర్శలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ విమర్శలు వస్తున్న సందర్భం లో కామెంట్స్ అయినటువంటి హర్ష భోగ్లే , మైకల్ వీటిపై స్పందించారు. చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన రోజు బెంగుళూరు జట్టు గెలిచింది. చెన్నై జట్టు ఓడిపోయింది. ఇక బెంగళూరు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లంతా సంబరాలలో మునిగిపోయారు. సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. అప్పటికే ధోని కొంత సేపు వేచి ఉన్నాడు. కానీ వాళ్ళు అలాగే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండడంతో ఆయన గ్రౌండ్ నుండి ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయారు. అంతేకానీ ఆయన ఉద్దేశపూర్వకంగా ఏది చేయలేదు అని విరు చెప్పుకొచ్చారు.