ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లోకి భారీ అంచనాల నడుమ అడుగుపెట్టిన జట్లలో ముంబై ఇండియన్స్ జట్టు ఒకటి. ఈ టీం ఇప్పటికే ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలను దక్కించుకోవడంతో ఈ జట్టు ఈ సీజన్ లోకి ఫేవరెట్ టీం గా బరిలోకి దిగింది. కానీ ఈ జట్టుకు ఎన్నో సంవత్సరాలుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఈ సారి ఈ జట్టులో కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు.
ఈ సీజన్ కి హార్దిక్ పాండ్యా ఈ జట్టు యొక్క కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ముంబై జట్టు హార్దిక్నో కెప్టెన్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నో విమర్శలు వెళ్లి వెళ్తాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు కూడా చాలా పేలవమైన ప్రదర్శనలు కనబరిచింది. ఇప్పటివరకు ఈ జట్టు 11 మ్యాచ్ లను ఆడగా అందులో కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇలా ప్రస్తుతం ఈ జట్టు ఈ సీజన్ లో చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఇలా దారుణమైన స్థితిలో ఉన్న ఈ జట్టు నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడింది.
కోల్కతా జట్టు మొదట బ్యాటింగ్ చేసి ముంబై ఇండియన్స్ పై 19.95 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దానితో ముంబై జట్టు నిన్నటి మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. ఇక ముంబై నిన్నటి మ్యాచ్ పర్ఫామెన్స్ పై ఇర్ఫాన్ పటాన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ... ఇక ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు కథ ముగిసింది. కోల్కతా జట్టు ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు నమన్ తో బౌలింగ్ చేయించడం పై హార్థిక్ కెప్టెన్సీ పై అనుమానాలు నిజమయ్యాయి. ఈ క్రమంలో అయ్యర్ , పాండే భాగస్వామ్యం కోల్కత్తా కు చాలా కలిసి వచ్చింది. ప్లేయర్లు కెప్టెన్ ను స్వీకరించడం చాలా ముఖ్యం. ఈ సీజన్లో ముంబై జట్టులో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు అని ఇర్ఫాన్ పేర్కొన్నారు.