ఐపీఎల్ హిస్టరీలో.. టాప్ 10 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరుగా చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విధ్వంసం ఎందుకో ఐపీఎల్ టోర్నిలో డబుల్ అవుతూ ఉంటుంది. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఇక బ్యాటింగ్లో విధ్వంసం అంటే ఏంటో చూపిస్తూ ఉంటారు. వీర బాదుడు బాదుతూ స్కోరుబోర్డుకే అలుపు వచ్చేలా చేస్తూ ఉంటారు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచడం చేస్తూ ఉంటారు. అయితే ఇక ఈ ఐపిఎల్ సీజన్లో కూడా ఇలాగే ఎంతో మంది ఆటగాళ్లు బ్యాటింగ్లో వీర విహారం చేస్తున్నారు.

 ఎంతో అలవోకగా సెంచరీలు కూడా చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఒక మెరుపు సెంచరీ నమోదు అయింది. సన్రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ లో చెలరేగిపోయాడు. ఏకంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లతో చెడుగుడు ఆడేసాడు. ఈ క్రమంలోనే  39 బంతుల్లోనే ఏకంగా సెంచరీ మార్కును అందుకున్నాడు అని చెప్పాలి. దీనిబట్టి అతని బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే 39 బంతుల్లోనే  హెడ్ సెంచరీ చేసిన నేపథ్యంలో  ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ళు ఎవరు అన్న విషయం కూడా తెరమీదకి వచ్చింది.

ఆ వివరాలు చూసుకుంటే క్రిస్ గేల్ ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు. గతంలో పూనేతో జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. యూసుఫ్ పటాన్ ముంబై పై 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్ ఆర్సిబి పై 38 బంతుల్లో శతక్కొట్టాడు. ఇక నిన్నటి మ్యాచ్లో ఆర్సిబి పై ట్రావిస్ హెడ్ 39 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత ముంబై పై 42 బంతుల్లో గిల్ క్రిస్ట్, గుజరాత్ లయన్స్ పై 42 బంతుల్లో దివిలియర్స్, చెన్నై పై 45 బంతుల్లో జయసూర్య, రాజస్థాన్పై 46 బంతుల్లో మురళి విజయ్ సెంచరీలు చేసి పాస్టర్ సెంచరీలు చేసిన లిస్టులో టాప్ 10 లో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: