విరాట్ కోహ్లీ న్యూ హెయిర్ కట్.. ఎంత ఖర్చయిందో తెలిస్తే మైండ్ బ్లాకే?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్ లు ఉన్న మోస్ట్ పాపులర్ క్రికెటర్ ఎవరు అంటే అందరూ విరాట్ కోహ్లీ పేరు నే చెబుతూ ఉంటారు. ఎందుకంటే అందరిలాగానే టీమిండియాలోకి ఒక సాదాసీదా ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. అంతేకాదు తాను అందరిలాగా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు.. చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆటతీరుతో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ.

 ఇక విరాట్ కోహ్లీ ఆటతో మాత్రమే కాదు తన యాటిట్యూడ్ తో కూడా ప్రత్యేకంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం రిచెస్ట్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతను వాడే వస్తువుల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ఇక ఎంత కాస్ట్ ఉంటుంది అనే విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కాగా ప్రస్తుతం కోహ్లీ ఐపిఎల్ తో బిజీ బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును గెలిపించడం కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాడు. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ లో సరికొత్త హెయిర్ స్టైల్ తో కోహ్లీ బరిలోకి దిగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈసారి కూడా కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు కోహ్లీ వాడుతున్న కొత్త హెయిర్ స్టైల్ కోసం భారీగానే ఖర్చు పెట్టాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగా సెలూన్ కు వెళ్లి హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ఎంతవుతుంది అంటే రూ. 100 లేదంటే 1000 లోపు ఖర్చవుతుంది అంటారు అందరూ. కానీ కోహ్లీ హెయిర్ స్టైల్ కు ఏకంగా లక్ష ఫీజు అయిందట. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీం ఈ విషయాన్ని తెలిపారు. ఈయన పలువురు సినీ, స్పోర్ట్స్, బిజినెస్ సెలబ్రిటీల దగ్గర నుంచి దాదాపు ఇదే ఫీజుని వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మాకు దగ్గరలో ఉన్న సెలూన్ లో వంద రూపాయలు పెడితే ఇంతకంటే మంచి హెయిర్ స్టైల్ చేస్తారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: