ఈరోజు ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్... ఎవరి బలాబలా లేంటో చూద్దాం..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్" 2024 అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతుంది. హాట్ ఫేవరెట్ టీములుగా బరిలోకి దిగిన జట్లు ఈ సారి పేలవమైన ప్రదర్శనను చూపిస్తూ ఉంటే ... పెద్దగా అంచనాలు లేకుండా ఈ సీజన్ ను మొదలు పెట్టిన జట్లు మాత్రం అదిరిపోయే రేంజ్ లో విజయాలను సాధిస్తూ పాయింట్లు పట్టిక లో ముందు వరుసలో దూసుకు పోతున్నాయి. ఇకపోతే ఈ రోజు విశాఖ పట్నం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సాగనుంది.

ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కోల్కతా రెండు మ్యాచ్ లు ఆడగా అందులో రెండింటిలో కూడా విజయాలను అందుకొని పాయింట్స్ పట్టికలో 2 వ స్థానం లో ఉంది. ఇక ఢిల్లీ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లను ఆడగా అందులో మొదటి మ్యాచ్ ఓడిపోయింది. ఇక ఆఖరిగా ఢిల్లీ ... చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఇప్పటి వరకు 2 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ ఒకటి ఓడిపోయి మరొకటి గెలిచి ప్రస్తుతం పాయింట్లు పట్టిక లో 7 వ స్థానంలో ఉంది. దానితో పాయింట్స్ టేబుల్ ప్రకారం 2 వ స్థానంలో ఉన్న కోల్కతా ను ఢీకొట్టడం 7 వ స్థానంలో ఉన్న ఢిల్లీకి కాస్త కష్టమైన అంశాంగానే కనబడుతుంది. కాకపోతే ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ , చెన్నై సూపర్ కింగ్స్ టీం ను భారీ తేడాతో ఓడించడంతో ఈ టీం ప్రస్తుతం చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తో ఈ జట్టు ఈ రోజు కోల్కతాను ఓడిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: