కేఎల్ రాహుల్ ని అందుకే కెప్టెన్సీ నుండి తప్పించాం.. షాకింగ్ విషయం చెప్పిన పూరన్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వరుసగా జరుగుతున్న మ్యాచ్ లు ప్రేక్షకులందరికీ అస్సలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. చివరి బంతి వరకు ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయంపై అభిమానులందరిలో కూడా ఉత్కంఠ నెలకొంటుంది.  నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో అసలు సిసలైన క్రికెట్ మజాను పొందగలుగుతున్నారు ప్రేక్షకులు.

 అయితే ఈ ఐపీఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగాయి అన్న విషయం తెలిసిందే. మరికొన్ని టీమ్స్ మాత్రం ఇక పాత కెప్టెన్ లనే కొనసాగించాయి. ఇలా పాత కెప్టెన్లను కొనసాగించిన టీమ్స్ లలో లక్నో టీం కూడా ఒకటి. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి రాహుల్ ను కెప్టెన్ గా కొనసాగించిన లక్నో.. ఇక ఈ సీజన్ కూడా రాహుల్ కెప్టెన్సీ లోనే బరిలోకి దిగింది. కానీ ఇటీవలే జరిగిన మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఏకంగా కేఎల్ రాహుల్ను కెప్టెన్సీ నుంచి తప్పించి నికోలస్ పూరన్ కు ఇక సారధ్య బాధ్యతలు అప్పగించింది . అయితే రాహుల్ లాంటి ప్లేయర్ ను ఎందుకు లక్నో యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తప్పించింది అన్న విషయం అందరూ కన్ఫ్యూషన్ లో పడిపోయారు.

 ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇలా కెప్టెన్సీ బాధ్యతలను పూరన్ కు అప్పగించింది జట్టు యాజమాన్యం. అయితే ఇంత అకస్మాత్తుగా కెప్టెన్సీ మార్పు ఎందుకు జరగాల్సి వచ్చింది అనే విషయంపై అందరిలో సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంలో కొత్త కెప్టెన్ పూరన్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాయం నుంచి కోలుకుని దాదాపు రెండు నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్నారు. ఆయనకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. రాహుల్ ప్రతి మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా అందుబాటులో ఉంటాడు అంటూ కొత్త కెప్టెన్ పూరన్ క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: