ముంబై కెప్టెన్ గా తొలగించడంపై.. తొలిసారి స్పందించిన రోహిత్?

praveen
2024 ఐపిఎల్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు నుంచి కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు విషయం ఎంత దుమారంగా రేగిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా ఇక మోస్ట్ సక్సెస్ఫుల్ సారధిగా కొనసాగుతున్న రోహిత్ శర్మను కాదని.. ఏకంగా ముంబై ఇండియన్ జట్టు యాజమాన్యం రోహిత్ ను పెట్టించిన తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించుకుంది. అయితే రోహిత్ శర్మను ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రోహిత్ ఫ్యాన్స్.

  అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ప్రస్తుత కెప్టెన్ హార్దిక్  అవమానించినట్లుగా ప్రవర్తించాడు. కాస్త అతి చేశాడు అంటూ ఎన్నో వీడియోలు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మను ఇలా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తప్పించిన నాటి నుంచి ఒక్కసారి కూడా రోహిత్ ఈ విషయంపై స్పందించలేదు. అసలు రోహిత్ ఏమనుకుంటున్నాడు అనే విషయంపై కూడా ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలీ.

 అయితే ఇటీవల ఈ విషయంపై మొదటిసారి స్పందించాడు రోహిత్ శర్మ. ఇటీవలే వరల్డ్ కప్ జట్టు ప్రకటన గురించి చీప్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ఈ ప్రెస్ మీట్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పైన రిపోర్టర్లు వరుసగా ప్రశ్నలు అడిగారు. దీంతో ఈ విషయంపై తొలిసారి స్పందించాడు రోహిత్. నేను ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్నా. రేపు ఉండకపోవచ్చు. ఇదంతా జీవితంలో ఒక భాగం. అన్ని మనం అనుకున్నట్లుగా జరగవు. గతంలోనూ ఇతరుల నాయకత్వంలో ఆడా. ఒక ప్లేయర్ గా నేను ఏం చేయగలను అనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. గత నెల రోజులుగా ఐపీఎల్లో అదే చేస్తున్న అంటూ తెలిపాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: