ఈ ఏండలెంటి... బెజవాడనే క్రాస్ చేసిన హైదరాబాద్..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బెజవాడ నగరాన్ని అక్కడి ప్రాంత ప్రజలు బ్లేజ్ వాడ అని పిలుస్తూ ఉంటారు. అలా ఈ పట్టణాన్ని పిలవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎండలు జోరుగా ఉంటాయి అని. ఇక్కడ సాధారణంగానే విపరీతమైన ఎండలు, వేడి ఉంటూ ఉంటుంది. మరి ఎండాకాలం వస్తే అది మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. విపరీతమైన ఎండల కారణంగా తీవ్రమైన ఉక్కపోతలు ఉంటాయి.

ఎండల కారణంగా జనాలు ఇళ్ల నుండి బయటకు రాకపోవడం , ఉక్కపోత కారణంగా  ఇంట్లో ఉన్నవారు కూడా ఏసీలు , కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి బెజవాడలో ఉంటుంది. ఇక బెజవాడ ఇంపాక్ట్ కాస్త గుంటూరు పై కూడా కనబడుతూ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ తర్వాత ఆ స్థాయి ఉష్ణోగ్రతలు గుంటూరు లో కనబడుతూ ఉంటాయి. ఇలా ఈ రెండు ప్రాంతాల్లో భారీ ఎండలు ఉండడం వాటి ద్వారా తీవ్రమైన ఉక్కపోత ఉండడంతో కొంతమంది ఈ ప్రాంత ప్రజలు ఎండాకాలంలో హైదరాబాద్ కి వెళ్లి అక్కడ ఉండేవారు. ఎందుకు అంటే హైదరాబాద్ పట్టణంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి అనే కారణంతో... ఇకపోతే హైదరాబాద్ ఇప్పుడు బెజవాడ , గుంటూరు ఉష్ణోగ్రతలను దాటిపోయింది.

ముఖ్యంగా తెలంగాణలోని చాలా గ్రామాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి పోతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతూ వస్తుంది. మరి హైదరాబాదులో ఒకప్పుడు చల్లటి వాతావరణం ఉండేది. ఇప్పుడు మరి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడానికి ప్రధాన కారణం చెట్లను కొట్టివేయడం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా డెవలప్ కావడానికి ప్రధాన కారణం అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది అని. కానీ ఇప్పుడు అది లేదు. మరి హైదరాబాదులో ప్రస్తుతం చల్లటి వాతావరణం లేకపోవడం అక్కడి ఐటి కంపెనీలకు ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మునపడితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: