రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న.. పాక్ సీనియర్ క్రికెటర్.. మళ్లీ ఆడతాడట?

praveen
సాదరణం గా అంతర్జాతీయ ఎంత మంచి ప్రస్థానం కొనసాగించిన ఆటగాడు అయినా సరే ఒక దశ వచ్చినప్పుడు తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అన్న విషయం తెలిసిందే. మహా మహా ప్లేయర్లకు సైతం ఇది తప్పదు. అయితే ఒకప్పుడు ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు.. మళ్ళీ క్రికెట్లో కొనసాగాలని అనిపించినా.. ఇక వీడ్కోలుని వెనక్కి తీసుకునే ఆలోచన చేసేవాడు కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది క్రికెటర్లు రిటైర్మెంట్ విషయంలో ఏకంగా ఎప్పటికప్పుడు మాట మారుస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ తమ వీడ్కోలును వెనక్కి తీసుకొని ఇక జాతీయ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఎంతో మంది ప్లేయర్లు ఇలా రిటైర్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ ఆల్ రౌండర్ కూడా చేరిపోయాడు. పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇమ్మాద్ వసీం ఇటీవల రిటైర్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పాలి. ఇతగాడు గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు మూడు ఫార్మాట్ల నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

 కానీ ఇప్పుడు ఇక ఈ మూడు ఫార్మాట్ల రిటైర్మెంట్ ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు ఈ పాకిస్తాన్ ప్లేయర్. కాగా క్రికెట్ బోర్డు అధికారులను కలిసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను. పొట్టి ఫార్మాట్లో నా అవసరాన్ని గుర్తించినందుకు సంతోషిస్తున్నాను. జూన్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ ఆడేందుకు రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. పాకిస్తాన్ జట్టుకి వరల్డ్ కప్ టైటిల్ అందించేందుకు తనవంతు కృషి చేస్తాను అంటూ ఇమాద్ వసీం ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: