మ్యాచ్ ఓడిపోయినా.. కోహ్లీ మాత్రం రికార్డు కొట్టాడు?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పరుగుల దాహానికి అడ్డు అదుపు అంటూ ఏమీ ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కూడా కోహ్లీ పరుగుల ప్రవాహం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో దశాబ్ద కాలం దాటిపోయిన ఇంకా అతని ఆట తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అంతకంతకు రాటు దేలుతు ప్రత్యర్ధులను వణికిస్తూనే ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించాడు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పుడు వరకు వరల్డ్ క్రికెట్లో లెజెండ్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది.. కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి తన పేరిట ఆ రికార్డులను లికించుకున్నాడు. ఇప్పటివరకు సాధించిన రికార్డులు సరిపోలేదు అన్నట్లుగానే ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు కోహ్లీ. ఇక టి20 ఫార్మాట్లో అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగిన కోహ్లీ 21 పరుగులు మాత్రమే చేసిన నిరాశపరిచాడు.

 అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమిపాలు అయ్యింది అని చెప్పాలి. అయితే జట్టు ఓడిపోయినప్పటికీ అటు విరాట్ కోహ్లీ మాత్రం అరుదైన మైలురాయిణి అందుకున్నాడు. టి20 క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా అవతరించాడు కోహ్లీ. మొత్తంగా ఆరవ క్రికెటర్గా నిలిచాడు. ఈ లిస్టులో విధ్వంసకరమైన ఆటగాడు క్రిస్ గేల్ 14562 పరుగులతో టాప్లో ఉన్నాడు. తర్వాత షోయబ్ మాలిక్ 13360, పోలార్డ్ 12,900, హేల్స్ 12319, డేవిడ్ వార్నర్ 12,065 పరుగులతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి. అయితే అత్యంత వేగంగా 10 వేల పరుగులు అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. విరాట్ 360 మ్యాచ్లలో ఈ ఘనతను సాధిస్తే క్రిస్ గేల్ 345 మ్యాచ్లలోనే 10000 పరుగులను చేరుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: