వైసీపీ మ్యానిఫెస్టో: జగన్ కి ఓట్లు రాలతాయంటారా?

Purushottham Vinay
9 ముఖ్యమైన హామీలతో వైఎస్సార్ సీపీ మేనిఫేస్టో 2024 రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లి గూడెంలో 2 పేజీలతో మేనిఫెస్టోని జగన్ రిలీజ్ చేయడం జరిగింది.అందులో కొన్ని పథకాలను కొనసాగించగా..మరికొన్ని పథకాలను విస్తరించడం జరిగింది.ముఖ్యంగా,విద్య,వైద్యం, రైతులకు సంబంధించిన పథకాలు కొనసాగిస్తామని చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.విద్య, వైద్యం, వ్యవసాయం, నాడు -నేడు, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత వంటి 9 అంశాలు జనాలని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ అంశాలు జనాలకు అనుగుణంగా ఉండటం వల్ల వైసీపీకి ఓట్లు రాలే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.


వైసీపీ మేనిఫేస్టోలో ముఖ్యమైన అంశాలు గమనిస్తే..వైఎస్సార్ చేయూత 75 వేల నుంచి నాలుగు దఫాలుగా లక్షా 50 వేలకు పెంచడం జరిగింది. అలాగే వైఎస్సార్ కాపు నేస్తం 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు ఇంకా వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద 45 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్షా 5 వేలకు పెంచడం, జగనన్న అమ్మ ఒడి పథకం కింద 15 వేల నుంచి 17 వేలకు పెంపు ఇంకా రెండు విడుతల్లో పెన్షన్ 3500లకు పెంపు, వైఎస్సార్ సున్నా వడ్డీలు రూ. 3లక్షలకు పెంపు, అర్హులైన పేదలకు ఇళ్లులేని వారికి ఇళ్లు,ఇంటి స్థలం కొనసాగింపు, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా కొనసాగింపు, వైఎస్సార్ రైతు భరోసా.. రూ.16 వేలు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా, జిల్లాకో స్కిల్ డెవ్ లప్ మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ, వాహన మిత్ర, మత్సకార భరోసాలు కూడా కొనసాగుతాయి.


ఇంకా 175 స్కిల్ హబ్ లతో యువతకు ఉపాధి కల్పించడం, అలాగే యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3590 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందట.ఇంకా లా నేస్తం, చేనేత నేస్తం కొనసాగుతుంది. అలాగే 2025 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అంశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే ఎస్సీ,ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇవ్వడం ఇంకా  మత్స్యకార భరోసా కింద ఐదు విడుతల్లో రూ. 50 వేలు ఇవ్వడం.. ఇలా అంశాలు చూస్తే ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఈ అంశాలు జనాలని ఆకట్టుకునే విధంగా ఉండటం వల్ల జగన్ కి ఈసారి ఓట్లు రాలే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని జగన్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: