ఐపీఎల్ హిస్టరీ లో.. మొదటి సిక్సర్ కొట్టింది ఎవరో తెలుసా?

praveen
ఐపీఎల్ మహాసమురానికి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి 2024 ఐపీఎల్ టోర్ని ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ కూడా మొదటి మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం మ్యాచ్ సమయానికి పనులు పూర్తి చేసుకోవాలని ఇక ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఈ టోర్నీ గురించి చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం జరగబోయే టోర్నీ ఎలా ఉంటుందో అనే విషయంపైనే కాదు గత టోర్నీల విషయాలను కూడా నెమరు వేసుకుంటున్నారు అభిమానులు.

 ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో ఎవరు అత్యుత్తమ రికార్డులు సాధించారు. ఇక ఎవరి పేరుట ఇప్పటికీ బ్రేక్ కాని రికార్డులు ఉన్నాయి అన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే 2008లో బీసీసీఐ ఐపీఎల్ టోర్ని ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఇలా ఐపిఎల్ టోర్నీ ప్రారంభించిన సమయంలో మొదటి బంతిని ఎదుర్కొన్నది ఎవరు? ఐపీఎల్లో మొదటి సెంచరీ చేసింది ఎవరు?  ఫస్ట్ వికెట్, ఫస్ట్ విజయం, ఫస్ట్ రన్, ఫస్ట్ సిక్స్, ఫస్ట్ ఫోర్ ఇలా అన్నిట్లో మొదటగా నిలిచింది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.  ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే..

 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఏప్రిల్ 18న జరిగింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన కోల్కతా మొదటి విజయాన్ని అందుకుంది. కాగా ఐపీఎల్ లో మొదటి బంతిని వేసింది ప్రవీణ్ కుమార్. ఇక ప్రవీణ్ కుమార్ వేసిన మొదటి బంతిని ఎదుర్కొంది సౌరబ్ గంగూలీ. ఐపీఎల్ లో మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్, మొదటి ఫిఫ్టీ, మొదటి సెంచరీ సాధించింది బెండెన్ మేకళ్ళమ్. ఇక మొదటి వికెట్ తీసింది జహీర్ ఖాన్. మొదటి క్యాచ్ పట్టింది జాక్వేస్ కల్లిస్, ఇక ఐపీఎల్ లో మొదటి స్టంపింగ్ అయింది మార్క్ బౌచర్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: