ఐపీఎల్ ఆడటం ఇష్టం లేకపోతే.. మరి వేలంలోకి రావడం ఎందుకో?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది  డిసెంబర్లో 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలం ప్రక్రియ ముగిసింది  ఇక ఇప్పుడు అన్ని టీమ్స్ కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి  ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లను సద్వినియోగం చేసుకుని టైటిల్ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పటికే క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఒక్కో ఆటగాడిని ఇక తమ క్యాంపులో చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి జట్టు యాజమాన్యాలు.

 ఇలాంటి సమయంలో ఇక చివరి నిమిషంలో కొంతమంది ఆటగాళ్లు కొన్ని టీమ్స్ కి ఊహించనీ షాక్ లు ఇస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి ఇలాగే షాక్ తగిలింది. ఏకంగా ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇటీవల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే జరిగిన మినీ వేలంలో 2.8 కోట్లకు అతని దక్కించుకుంది కోల్కతా. అయితే ఈ డబ్బుతో కొనసాగడానికి ఇష్టం లేకనో ఏంటో కానీ మరోసారి వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో చేసేదేమీ లేక కోల్కతా నైట్రేటర్స్ అతని స్థానాన్ని ఫిలిప్ సాల్ట్ తో భర్తి చేసుకుంది.

 అయితే జాసన్ రాయ్ కి  ఇదేమి కొత్త కాదు. 2017 లో గుజరాత్ లయన్స్ తరఫున మొదటిసారి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు.  2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు. 2021 లో సన్రైజర్స్ హైదరాబాద్ కి 2022లో గుజరాత్ టైటాన్స్ కి 2023 లో కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడాడు  అయితే 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతన్ని దక్కించుకుంటే ధర సరిపోదు అని అనుకున్నాడో ఏమో.. వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్ నుంచి తప్పుకున్నాడు. ఇక 2022లో గుజరాత్ బేస్ ప్రైస్ రెండు కోట్లకు కొనుగోలు చేస్తే అప్పుడు వ్యక్తిగత కారణాలు చెప్పి చివరికి ఐపీఎల్ కు దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఇదే చేశాడు. అయితే అతని తీరుపై అటు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో ఆడటం ఇంట్రెస్ట్ లేకపోతే ఇక ఎందుకు వేలంలో పాల్గొనడం అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: