సిక్సర్లు కొట్టడంలో.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకసారి క్రిజులో కుదురుకున్నాడు అంటే చాలు బ్యాటింగ్ లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి బ్యాటింగ్ తీరు ఉంటుంది. కాబట్టి అతనికి హిట్ మ్యాన్ అనే బిరుదును ఇచ్చేశారు. సాధారణంగా క్రికెట్లో కొంతమంది ఆటగాళ్ళు ఫోర్లు కొట్టడం ద్వారా ఎక్కువ పరుగులు సాధిస్తూ ఉంటారు. ఇంకొంతమంది వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం ద్వారా ఎక్కువ పరుగులు చేస్తూ ఉంటారు. కానీ రోహిత్ శర్మ అలా కాదు ఎంతో అలవోకగా బంతులను సిక్సర్ లుగా మలుస్తూ ఉంటాడు. ఏకంగా స్టేడియం బయటికి సైతం బాదేస్తూ ఉంటాడు.

 అందుకే ఇప్పటివరకు రోహిత్ శర్మ ఏ ఫార్మాట్లో అయినా సాధించిన పరుగులు చూసుకుంటే.. ఇక వికెట్ల మధ్య పరుగులు పెడుతూ సాధించిన దాని కంటే బౌండరీల ద్వారా సాధించిన పరుపులే ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సిక్సర్లతోనే సునామీ సృష్టిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పటికే సిక్సర్లు కొట్టడంలో భారత క్రికెట్లో అందరిని దాటేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. కాగా ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉండగా.. ఈ టెస్ట్ సిరీస్ లో కూడా పలు రికార్డులను సాధిస్తూ దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ.

 ఈ క్రమంలోనే ఇటీవల చరిత్ర సృష్టించాడు హిట్ మ్యాన్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలో ఏకంగా 50 సిక్సర్లు కొట్టిన తొలి ఆసియా ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో హిట్ మాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. కాగా రోహిత్ శర్మ తర్వాత స్థానాలలో రిషబ్ పంత్ 38 సిక్సర్లతో ఉన్నాడు. ఇక ఆ తర్వాత స్థానంలో యశస్వి జైష్వాల్ 26, రవీంద్ర జడేజా 26, మయాంక్ అగర్వాల్ 23, అబ్దుల్లా షఫీక్ 18, అక్షర్ పటేల్ 17 సిక్సర్లతో ఈ లిస్టులో ఉన్నారు అని చెప్పాలి.ఇక ఇప్పటికే హాఫ్ సెంచరీ తో చెలరేగిపోయిన రోహిత్ శర్మ రెండో రోజు ఆటను కొనసాగించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: