ఆ రోజు ఏం జరిగిందంటే.. అసలు విషయం చెప్పేసిన అశ్విన్ భార్య?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఆటగాళ్ల గురించి ఏదో ఒక విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎవరైనా ఆటగాడు ఇక భారత జట్టుకు దూరం అయ్యాడు అంటే చాలు అతను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడ లేదా అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ఒకవేళ గాయం కారణంగా దూరమైతే అతని గాయం తీవ్రత ఎలా ఉంది. ఎప్పటి వరకు కోలుకొని మళ్ళీ తిరిగి జట్టులోకి వస్తాడు అనే విషయంపై ఆరా తీయడం చేస్తూ ఉంటారు.

 అయితే ఎవరైనా ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో ఇలా భారత జట్టుకు దూరమయ్యాడు అంటే ఏకంగా క్రికెట్ ని సైతం దూరం పెట్టే వ్యక్తిగత కారణాలు ఏంటి అన్న విషయాలను తెలుసుకోవడానికి క్రికెట్ లవర్స్ అందరూ తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి విషయాల కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే టీమిండియా సీనియర్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు దూరమైన సమయంలో కూడా ఇలాంటి ఎంక్వైరీలు చేశారు అభిమానులు. రాజ్కోట్ వేదికగా  జరిగిన టెస్ట్ సమయంలో స్పిన్నర్ అశ్విన్ అకస్మాత్తుగా జట్టును వీడాడు.

 దీంతో వ్యక్తిగత కారణాలతో అతను జట్టుకు దూరమయ్యాడు అనే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రకటించాడు. అయితే అశ్విన్ ఎందుకు ఇలా సడన్గా ఇంటికి వెళ్లి పోవాల్సి వచ్చింది అనే విషయంపై ఒక క్లారిటీ లేదు. అయితే ఈ విషయంపై అతని భార్య ప్రీతి స్పందిస్తూ అసలు విషయాలు చెప్పుకొచ్చింది. ఆరోజు అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న కొద్దిసేపటికి.. మా అత్తయ్య సడన్గా కింద పడిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాము. అయితే ఆ సమయంలో అశ్విన్ తల్లికి దగ్గరగా ఉండాలని వైద్యులు అభిప్రాయపడ్డారు. దీంతో అత్తయ్య అనారోగ్యం గురించి ముందుగా అశ్విన్ కు చెప్పాలి అనుకోక పోయినప్పటికీ.. వైద్యులు సూచన అతనికి సమాచారం అందించాల్సి వచ్చింది.   రోహిత్, రాహుల్ భాయ్ ఇద్దరు ఎంతగానో సహకరించారు అంటూ అశ్విన్ భార్య ప్రీతి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: