ఐసీసీ డెడ్ లైన్ వచ్చేసింది.. అప్రమత్తమైన బీసీసీఐ?

praveen
సాధారణంగా రెండు టీమ్స్ మద్దతు ద్వైపాక్షిక సిరీస్ జరిగితేనే క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆ మ్యాచ్ లు చూసేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అలాంటిది ఏకంగా ప్రపంచకప్ టోర్నీ జరిగితే ఏకంగా వరల్డ్ క్రికెట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ సమయంలో.. ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ని పొందారు. ఇక ఇప్పుడు అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు 2024 t20 వరల్డ్ కప్ సిద్దమయింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇక ఈ వరల్డ్ కప్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ధనాధన్ ఫార్మాట్లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్ని ఈసారి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించబోతుందో అనే విషయంపై చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఇక ఈ వరల్డ్ కప్ లో విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై ఎంతోమంది విశ్లేషకులు కూడా ఇప్పటికే రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే  అయితే టి20 వరల్డ్ కప్ 2024 టోర్ని నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని ప్రణాళికలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

 ఈ క్రమంలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా అటు t20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను మే ఒకటి లోపు ప్రకటించేలా ఆదేశాలు జారీ చేయాలని ఐసిసి భావిస్తోందట. అన్ని జట్లు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే మే 25వ తేదీ వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించబోతుందట ఐసిసి. అయితే ఐపీఎల్ మే 27 వరకు కూడా జరుగుతూ ఉండడంతో.. బీసీసీఐకి ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమే అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే టీ20 వరల్డ్ కప్ జట్టు సెలక్షన్ ఉంటుందని అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ  ఆదేశాలతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: