కోహ్లీకి కూతురు, కొడుకు.. 2016లో కోహ్లీ జాతకం మొత్తం చెప్పేసిన జ్యోతిష్యుడు?
అయితే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఇక విరాట్ కోహ్లీ గురించి ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చినా కూడా అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కాగా గత కొంతకాలం నుంచి వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకుని విరాట్ కోహ్లీ ఎందుకు సెలవు తీసుకున్నాడు అనే కన్ఫ్యూషన్ పెట్టి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి అయ్యాడు. ఇటీవలే కోహ్లీ భార్య అనుష్క పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కోహ్లీ కొడుకుకి అకాయ్ అనే పేరు పెట్టారు అని చెప్పాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నాటి నుంచి ఆయన కెరియర్లో సాధించిన రికార్డుల గురించి ఇక దాదాపు మూడేళ్ల పాటు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి ఆయన పెళ్లి, పిల్లల గురించి అన్ని కూడా ముందుగానే ఓ జ్యోతిష్యుడు ఊహించాడు. 2016 లోనే ఎంతో కచ్చితంగా ఈ విషయాలను చెప్పేసాడు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. 2025 ఆగస్టు నుంచి 2027 ఫిబ్రవరి మధ్యకాలంలో విరాట్ కోహ్లీ కెరియర్ కుదుపుకు లోన్ అవుతుందని తెలిపిన ఆయన 2027లో మళ్లీ పుంజుకొని 2028లో అద్భుతంగా విరాట్ కోహ్లీ కెరియర్ ముగిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.