రోహిత్ సరే.. కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో ఆడతాడా?

praveen
గత కొంతకాలం నుంచి ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. అయితే లీగ్ దశలో సూపర్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్న టీమిండియా.. ఇక నాకౌట్ మ్యాచ్లలో మాత్రం తడబడుతుంది. దీంతో ఇక కీలకమైన మ్యాచ్లలో ఓడిపోయి చివరికి ఇంటి దారి పడుతుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి పరిస్థితుల నేపద్యంలో ప్రతి వరల్డ్ కప్ టోర్నీలో కూడా భారత అభిమానులందరికీ కూడా నిరాశ మిగులుతుంది అని చెప్పాలి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్ని లో భారత జట్టు తప్పకుండా వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది అని అందరూ అనుకున్నారు.

 అయితే అందుకు తగ్గట్లు గానే టీమిండియా ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. ఇక టీమిండియా జోరు చూస్తే ఫైనల్ కూడా గెలిచి వరల్డ్ కప్ కలనీ నిజం చేస్తుందని అనుకున్నారు. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఇక ఇప్పుడు 2024 ఏడాదిలో టి20 వరల్డ్ కప్ లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్లు వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. అయితే ఇటీవల ఈ విషయంపై మాట్లాడిన బిసిసిఐ సెక్రటరీ జై షా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో t20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుస్తుంది అనే నమ్మకం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

 దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కోహ్లీ అభిమానుల్లో మాత్రం కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఆడతాడ లేదా అనే విషయంపై చర్చించుకుంటున్నారు. పొట్టి ఫార్మాట్లో తన నిలకడైన అటతీరుతో ఆకట్టుకున్న కోహ్లీ.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఆడతాడ అంటే కచ్చితంగా అని సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం కోహ్లీ అభిమానులకు నెలకొంది. రోహిత్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలుస్తాము అని నొక్కి చెప్పిన జై షా కోహ్లీ ప్రస్తావన మాత్రం ఎక్కడ తీసుకురాలేదు. దీంతో టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక విషయంలో కోహ్లీని పరిగణలోకి తీసుకోవట్లేదు అనే చర్చ కూడా మొదలైంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: