సీనియర్ల ఓటమికి ప్రతీకారాన్ని.. ఇప్పుడు కుర్రాళ్ళు తీర్చుకుంటారా?

praveen
ఆస్ట్రేలియా, టీం ఇండియా.. ఈ రెండు జట్లు కూడా వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక భారత్ కు చిరకాల ప్రత్యర్థి  పాకిస్తాన్ అని చెబుతూ ఉంటారు. కానీ పాకిస్తాన్ తర్వాత ఇలా టీమిండియాకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగుతున్న జట్టు ఏదైనా ఉంది అంటే.. అది కేవలం ఆస్ట్రేలియా మాత్రమే అని చెప్పాలి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోరు కోరుకొన సాగుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి ఆస్ట్రేలియా జట్టు ఐసిసి టోర్నమెంట్లలో అటు టీమిండియాకు వరుసగా షాక్ లు ఇస్తూనే వస్తుంది.

 ఎందుకంటే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలవాలి అనే కలను చెల్లాచెదురు చేసేసింది ఆస్ట్రేలియా జట్టు. అప్పటి వరకు వరుస విజయాలు సాధిస్తూ దూసుకొచ్చిన టీమిండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో చివరికి ఓటమిపాలు అయింది అని చెప్పాలి. దీంతో భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.. ఇక అంతకుముందే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా టీమ్ ఇండియాను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది ఆస్ట్రేలియా జట్టు. ఇలా రెండుసార్లు కూడా ఐసీసీ ఫైనల్స్ లో టీమిండియాను ఓడించింది ఆస్ట్రేలియా.

 అయితే ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియాకు అవకాశం వచ్చింది. మరోసారి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇంకో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఏడాది వ్యవధిలోనే సీనియర్ల మధ్య జరిగిన రెండు మెగా టోర్ని ఫైనల్ లో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. అయితే ఇక ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లో మాత్రం టీం ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎంతగానో ఆశపడుతుంది. మరి ఇప్పుడు వరుసగా మూడోసారి ఆస్ట్రేలియాతో ఫైనల్ లో తడబడుతున్న టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: