టీమిండియా కెప్టెన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.. కుమ్మేస్తున్నాడుగా?
వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వరకు అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా ఆరు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఆరింటిలో కూడా విజయం సాధించి సత్తా చాటింది అని చెప్పాలి. ఇక ఇందులో మూడు మ్యాచ్లలో 200కు పైగా పరుగులు తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే ఇక ప్రస్తుతం అండర్ 19 టీమిండియా జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న ఉదయ్ సహారాన్ అయితే ప్రతి మ్యాచ్ లోను కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటివరకు అతను ప్రపంచకప్ టోర్నీలోనే లీడ్ స్కోర్ గా కొనసాగుతూ వున్నాడు అని చెప్పాలి.
ఇప్పటివరకు యంగ్ టీమ్ ఇండియా ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 389 పరుగులు చేశాడు ఉదయ్ సహారన్. ఇందులో ఒక సెంచరీ తో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. మిస్టర్ కన్సిస్టెంట్ గా ప్రశంసలు అందుకుంటున్న ఉదయ్ సహారాన్ భారత జట్టును కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొడుతూ జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈక్రమంలోనే అతని ప్రదర్శన పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పాలి. అయితే డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన యంగ్ టీమ్ ఇండియా ఇక ఈసారి కూడా తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకోవడం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.