హమ్మయ్యా.. సూపర్ సెంచరీ.. గిల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడోచ్?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీం ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా జట్టు అద్భుతంగా రానిస్తుంది అని చెప్పాలి. అయితే అటు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా అటు విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం పట్టు బిగించింది. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ లోనే కాదు రెండో ఇన్నింగ్స్ లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది టీమిండియా.

 అయితే టీం ఇండియా ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న గిల్ మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు అనే విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా అతను తక్కువ పరుగులకు వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. ఇక అనవసరంగా భారత జట్టు అతనికి వరుసగా అవకాశాలు ఇస్తుందని టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన పూజార లేదంటే రహానే లలో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి విమర్శల నేపథ్యంలో గిల్ ఇటీవల సూపర్ సెంచరీ తో చెలరేగాడు.

 రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్న సమయంలో.. గిల్ మాత్రం సెంచరీ తో కదం తొక్కాడు. 132 బంతుల్లో రెండు సిక్సర్లు 11 ఫోర్ లతో శతకం సాధించాడు. మొత్తంగా 147 బంతుల్లో 104 పరుగులు చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న గిల్.. ఇటీవల భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం తన సెంచరీ తో ఆదుకున్నాడు అని చెప్పాలి.  కాగా ప్రస్తుతం భారత జట్టు 377 పరుగులు ఆదిక్యలో కొనసాగుతోంది. గిల్ సెంచరీ తో అటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: