పాక్ బోర్డుకు షాకిచ్చిన సర్ఫరాజ్.. దేశం విడిచిపెట్టబోతున్నాడట?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీం గా కొనసాగుతున్న పాకిస్తాన్ జట్టు ఇక ఎందుకో అంచనాలకు తగ్గట్లుగా రాణించడం లేదు. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీతో పాటు ఇక తర్వాత జరిగిన ద్వైపాక్షిక సిరీస్లలో కూడా ప్రత్యర్థికి ఎక్కడ పోటీ ఇవ్వలేక పోతుంది. సొంతగడ్డపై మ్యాచ్ లు జరుగుతున్న కూడా పేలవ ప్రదర్శన చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఆశ్రఫ్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

 ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ ను బాగు చేయడం నావల్ల కాదు బాబోయ్ అన్నట్లుగానే ఆయన కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రాజీనామా కాస్త చర్చనియాంశంగా మారిపోయింది. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ జట్టుకు మాజీ కెప్టెన్ గా సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు సర్ఫరాజ్ అహ్మద్. అయితే గత కొంతకాలం నుంచి అతనికి సరైన అవకాశాలు రావడం లేదు. ఇక సెలక్టర్లు ప్రతిసారి కూడా అతన్ని పక్కన పెడుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే జట్టులో చోటు దక్కుతుందేమో అని వేచి చూసి విసుగు చెందాడో లేకపోతే ఇంకేమైనా అనుకున్నాడో కానీ సీనియర్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇక ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడట. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తుంది. జట్టులో తన స్థానంపై అనుస్థితి నెలకొనడంతో భార్యా పిల్లలతో కలిసి దేశం విడిచిపెట్టాలని అనుకుంటున్నాడట సర్ఫరాజ్ అహ్మద్. కరాచీ నుండి లండన్ కు మకామ్ మార్చబోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించితం చేస్తుంది. అయితే లండన్ లో ఉంటూ నాలుగేళ్ల పాటు కౌంటి క్రికెట్ ఆడితే ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: