షాకింగ్ : ఒకే జట్టులో.. ఒకేసారి నలుగురు రిటైర్మెంట్?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ కాలం పాటు కెరియర్ను కొనసాగించాలని ప్రతి ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటారు. ఇక మూడు ఫార్మట్లలో సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగించి క్రికెట్కు ఎనలేని సేవలు చేయాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఎక్కువ కాలం పాటు కెరియర్ను కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే ఫిట్నెస్ ఎంత అవసరమో ఎప్పటికప్పుడు సరికొత్త ఆట తీరుతో అలరించడం కూడా అంతే అవసరం అని చెప్పాలి.

 అయితే ఇలా ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు చివరికి జట్టులో చోటు కోల్పోతారు. ఆ తర్వాత చాలామంది నిరాశతో ఇక రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తుంటారు. ఇంకొంతమంది తమ కెరీర్ కు ఘనమైన వీడుకోలు పలకడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా ఇలా జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నారు అంటే ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు. కానీ ఏకంగా జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లు నలుగురు కూడా ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తారా. అదేంటి నలుగురు ప్లేయర్లు ఒకేసారి ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాలని ఆలోచిస్తారు అని అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ వెస్టిండీస్ జట్టుకు ఇలాంటి బిగ్ షాక్ తగిలింది.

 2016 ఉమెన్స్ t20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న నలుగురు ప్లేయర్లు కూడా ఒకేసారి రిటైర్మెంట్ ఆలోచన చేశారు. మీడియం ఫేసర్ సల్వాన్, స్పిన్నర్ అనీషా మహమ్మద్, కవలలు కైసియా నైట్, కుశోనా నైట్ ఆటకు వీడ్కోలు పలికారు. బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్ లో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనున్న సమయంలో.. ఇక ఈ నలుగురు అనుభవజ్ఞులైన సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడం అటు వెస్టిండీస్ మహిళా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ నలుగురు కీలక ప్లేయర్లు లేని లోటును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలా పూడ్చుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: