కోచ్ ఆదేశాలను ధిక్కరించిన ఇషాన్ కిషన్.. ఇక కెరియర్ రిస్కులో పడ్డట్టేనా?

praveen
గత కొంతకాలం నుంచి ఇషాన్ కిషన్ వ్యవహార శైలి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉన్న సమయంలో.. తన మానసిక ఆరోగ్యం బాగాలేదు అంటూ అటు బీసీసీఐ పర్మిషన్ తో రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఇషాన్ కిషన్. అయితే ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టి20 సిరీస్ కి కూడా అతను అందుబాటులో లేడు అన్న విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్ ఈ టి20 సిరీస్ కి కూడా బ్రేక్ కావాలని కోరాడు అంటూ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

 అయితే జట్టు నుంచి అర్ధంతరంగా తప్పుకున్న ఇషాన్ కిషన్ ఇక నేరుగా మళ్ళీ టీమ్ ఇండియాలోకి రాలేడు అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్స్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరీలోకి దిగి ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అతనికి ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ కు పరిగణలోకి తీసుకుంటాము మేనేజ్మెంట్ భావిస్తుంది అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు  అయితే ఇషాన్ కిషన్ మాత్రం అటు కోచ్ ద్రావిడ్ ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు. ఝార్ఖండ్ తరపున రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్లకు దూరంగానే ఉన్నాడు. ఇటీవలే మొదలైన మూడో మ్యాచ్ లోను ఇషాన్ కిషన్ కనిపించలేదు. దీంతో ఇక కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశాలను అతను ధిక్కరించాడు అని చెప్పాలి.

 ఇప్పటికే ఇంగ్లాండు తో టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది  అయితే ఇషాన్ కిషన్ రంజీలు ఆడకపోవడంతో అతడు ఇక మిగిలిన మూడు టెస్టులకు కూడా సెలక్ట్ కావడం అనుమానంగానే కనిపిస్తుంది. అయితే తన మానసిక ఆరోగ్యం గురించి ఒకవేళ బిసిసిఐకి అప్డేట్ ఇవ్వకుండానే రంజీ మ్యాచ్ లకు ఇషాన్ కిషన్ డుమ్మా కొట్టినట్లైతే ఇక ఇది అతని కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఇక భారత జట్టులో అతని రీఎంట్రీ ఎంతో కష్టంగా మారేలాగే కనిపిస్తూ ఉంది  దీంతో టీమ్ ఇండియా తరఫున ఇషాన్ కిషన్ మళ్ళీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాడా లేదా అనే విషయం కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: