కన్ఫ్యూజన్ వద్దు.. ఇండియా - ఆఫ్ఘాన్ సిరీస్ లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?

praveen
గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అటు భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అటు భారత గడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడింది టీమిండియా. టి20 సిరీస్ లో విజయం సాధించి శుభారంభం చేసింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడ మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఆడి సత్తా చాటింది భారత జట్టు.

 ఇక ఎప్పుడు భారత పర్యటనకు రాబోతున్న విదేశీ టీమ్స్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య టి20 సిరీస్ జరగబోతుంది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో రెండు టీమ్స్ తలబడబోతున్నాయి అని చెప్పాలి. ఇక జనవరి 25వ తేదీ నుంచి ఇంగ్లాండు భారత జట్టు మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి   అయితే ఇలా వరుసగా టీమ్ ఇండియా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ ఎంటర్టైన్మెంట్ పంచడం బాగానే ఉంది. కానీ ఒక విషయంలో మాత్రం అటు ప్రేక్షకులు అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు.

 అదేంటంటే ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం ఎందులో చూడవచ్చు అని. కొన్నిసార్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటే.. ఇంకొన్నిసార్లు జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య జరగబోయే టి20 సిరీస్ ఎందులో చూడాలో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన మూడు మ్యాచ్లు జియో సినిమా, స్పోర్ట్స్ 18 చానల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.  కాగా ఈనెల 11న మొదటి టీ20 మొహలీలో రెండవ టి20 14న ఇండోర్లో, మూడో టి20 17న బెంగళూరులో జరగబోతుంది. అన్ని మ్యాచ్లు కూడా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: