రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ చేతికి.. కొత్త బాధ్యతలు.. ఏకంగా కెప్టెన్ గా?

praveen
మొన్నటి వరకు ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ గా కొనసాగుతూ ఇక మూడు ఫార్మాట్లో కూడా తన బ్యాటింగ్ తో జట్టుకు ఎంతో అద్భుతమైన ప్రారంభాలు అందించిన డేవిడ్ వార్నర్.  ఇక ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో ఏళ్లపాటు ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ స్టార్ ప్లేయర్.. టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇటీవల నిర్ణయం తీసుకున్నాడు.

 పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తన కెరీర్ లో ఇక చివరి టెస్ట్ మ్యాచ్ అంటూ ఇప్పటికే డేవిడ్ వార్నర్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతను కొనసాగుతాడు అని అందరు భావించారు  కానీ ఊహించని రీతిలో అతను వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే టి20 ఫార్మాట్ తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లో కూడా కొనసాగుతాను అంటూ స్పష్టం చేశాడు డేవిడ్ వార్నర్.

 అయితే వన్డే క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేతికి ఇప్పుడు కొత్త బాధ్యతలు వచ్చాయి అన్నది తెలుస్తుంది. ఇంటర్నేషనల్ లీగ్ టి20 ఫ్రాంచైజీ దుబాయ్ క్యాపిటల్స్ తమ జట్టు కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ను నియమించుకుంటున్నట్లు తెలిపింది. జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఈ టి20 లీగ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే గత సీజన్లో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతను కెప్టెన్గా వ్యవహరించగా ఇక ఇప్పుడు పంత్ రాకతో అతను కెప్టెన్సీ కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన అదే టీం లో ఇప్పుడు అతనికి కెప్టెన్సీ దక్కింది అనేది తెలుస్తుంది. అయితే పాకిస్తాన్తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ ఇక డేవిడ్ వార్నర్ కు చివరి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: