టెస్ట్ క్రికెట్ పై కుట్ర జరుగుతుంది.. ఆసీస్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
అసలు సిసలైన క్రికెట్కు ప్రతిరూపం ఏంటి అంటే అది టెస్ట్ ఫార్మాట్ అని ప్రతి ఒక ఆటగాడు కూడా చెబుతూ ఉంటాడు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ తోనే క్రికెట్ అనే ఆట పుట్టింది. ఇక ఆ తర్వాత ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు వన్డే ఫార్మాట్ తో పాటు టి20 ఫార్మాట్ కూడా అందుబాటులోకి వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడిపోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అందరూ అవును అనే సమాధానమే చెబుతూ ఉన్నారు.

 ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ను ఆదరించే ప్రేక్షకులు సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఇక ఇటీవలే కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతూ ఉండడమే ఎందుకు కారణం. మరి ముఖ్యంగా టి20 ఫార్మాట్ ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తర్వాత ఈ ఫార్మాట్ ని చూడటానికే అటు ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్లో లాగా ఫలితం కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకపోవడం.. ఇక ప్రేక్షకులకు కావలసిన ఉరుములు మెరుపులు అన్నీ కూడా ఈ ఫార్మాట్లో కనిపిస్తూ ఉండడంతో ఇక మిగతా ఫార్మాట్లను పట్టించుకోవడమే మానేస్తున్నారు ప్రేక్షకులు.

 కొంతమంది ప్లేయర్లు అయితే ఏకంగా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి టి20 ఫార్మాట్లో కొనసాగడానికి ఆసక్తిని కనబరిస్తున్నారు అని చెప్పాలి. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా టెస్ట్ ఫార్మాట్ ను చిన్న  చూపు చూస్తున్నాయ అంటే ప్రస్తుతం జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం గా మారింది. అయితే ఇటీవల న్యూజిలాండ్ తో ఫిబ్రవరిలో ఆడాల్సిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా  మారింది. అయితే ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్స్ స్టీవ్ వా అగ్రహం వ్యక్తం చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్ పై కుట్రేనని మండిపడ్డాడు. న్యూజిలాండ్ క్రికెట్ ను దక్షిణాఫ్రికా అవమానించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ బీసీసీఐ సహా ప్రపంచ క్రికెట్ బోర్డులు అన్నీ కూడా టెస్ట్ క్రికెట్ ను పరిరక్షించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: