అశ్విన్ చెప్పింది నిజమే.. అతను ఫ్యూచర్ స్టార్ అయ్యేలాగే ఉన్నాడే?
అయితే ఇక అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా కుర్రాళ్ళు పరుగులు సాధిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన యంగ్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ కూడా ఇలాగే అదరగొడుతున్నాడు. వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు టీమిండియా రెండు మ్యాచ్ లు ఆడింది. అయితే మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్లో మాత్రం ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే.
రెండో మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ అటు భారత జట్టు యువ ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం మరోసారి అదరగొట్టాడు. మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో చెలరేగిన ఈ కుర్రాడు.. ఇక రెండో మ్యాచ్ లోను 64 బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 50 పరుగులు సాధించాడు. ఇక అతని బ్యాటింగ్ తీరు చూస్తే భారత స్పిన్నర్ అశ్విన్ చెప్పింది నిజమే అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. సాయి సుదర్శన్ రానున్న రోజుల్లో తప్పకుండా భవిష్యత్తు సూపర్ స్టార్ అవుతాడని.. టీమిండియా కు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు అశ్విన్. ఇక ఇప్పుడు అతను వరుసగా హాఫ్ సెంచరీలు సాధించడం చూస్తే ఆశ్విన్ చెప్పింది నిజమే అని ప్రేక్షకులు కూడా కామెంట్ చేస్తున్నారు.