బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ లో రాణిస్తే భారీ ఇన్సెంటివ్స్?

praveen
ఎంతోమంది యువ ఆటగాళ్ళను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ప్రతిష్టాత్మకమైన టి20 లీగ్ ప్రారంభించింది బీసీసీఐ. 2008లో ఒక సాదాసీదా టోర్నీగా ప్రారంభమైన ఐపిఎల్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఏకంగా వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా గుర్తింపును సంపాదించుకుంది. అయితే కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే కాదు ఎంతో మంది స్టార్ ప్లేయర్లు కూడా ఈ లీగ్ లో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 అయితే సాధారణంగా వరల్డ్ క్రికెట్ లో అప్పటికే నిరూపించుకున్న స్టార్ ప్లేయర్లకు.. ఐపీఎల్ లో  వేలంలో భారీ ధర పలుకుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అన్ని ఫ్రాంచైజీలు  యువ ఆటగాళ్ల మీద కన్నేస్తున్న నేపథ్యంలో.. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టని యంగ్ ప్లేయర్స్ సైతం రికార్డు స్థాయిలో కోట్ల ధర పలుకుతూ ఉండడం గమనార్హం. కాగా 2024 ఐపిఎల్ సీజన్ కోసం ప్రస్తుతం సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా మినీ ఆక్షన్ ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే ట్రేడింగ్ ద్వారా కొన్ని టీమ్స్ ఇతర టీమ్స్ లోని ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఈ నజరానాలు అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఐపీఎల్లో రానించి వారు అప్పటికే అంతర్జాతీయ జట్టులోకి ఎంపికై పదికి పైగా మ్యాచ్లు ఆడితే వారికి నజరానాను డబుల్ చేయాలని నిర్ణయించుకుందట. ఇక ఐపీఎల్ వేలంలో 50 లక్షల కంటే ఎక్కువ ధర పలికిన ప్లేయర్లకు మాత్రమే ఇలా వారి ప్రదర్శనను బట్టి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: