చరిత్ర సృష్టించిన అర్షదీప్.. ఇండియన్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ను ముగించుకుంది. కాగా నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఇక మొదటి వన్డే మ్యాచ్ లో ఆతిధ్య సౌత్ ఆఫ్రికా తో తలబడుతుంది అని చెప్పాలి. అయితే ఇక మొదటి వన్డే మ్యాచ్లో సఫారీ గడ్డపై భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఏకంగా బంతులతో నిప్పులు చెరిగారు అని చెప్పాలి. అర్షదీప్ అయితే వరుస వికెట్లు తీశాడు. ఏకంగా మొదటి మ్యాచ్లో ఐదు వికెట్ల హాల్ సాధించాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన మొదటి మ్యాచ్ లో 5/37 వికెట్లు తీసిన తొలి భారత ఫేసర్ గా చరిత్ర సృష్టించాడు అర్షదీప్. గతంలో భారత్ తరపున స్పిన్నర్లు సునీల్ జోషి 5/6, చాహల్ 5/22, రవీంద్ర జడేజా 5/ 33 ఫీట్ సాధించగా.. అర్షదీప్ ఈ రికార్డు సాధించిన తొలి ఫేసర్గా నిలిచాడు అని చెప్పాలి. అంతేకాదు సౌత్ ఆఫ్రికా పై ఇండియన్ ఫేసర్లు 9 వికెట్లు తీయడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా మొదటి మ్యాచ్ లో అటు భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది.