సంజూ శాంసన్ ను.. కెప్టెన్సీ నుంచి తప్పించాలి : శ్రీశాంత్
అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు జరిగిన నేపథ్యంలో మిగతా టీమ్స్ కెప్టెన్సీ మార్పుపై కూడా చర్చలు తెరమీదకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించలేకపోతున్న ఆటగాళ్లను కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పించాలి అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి రివ్యూలు ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి.
కాగా టీమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ సైతం ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న సంజూ శాంసన్ ను సారధ్య బాధ్యతల నుంచి తప్పించాలి అంటూ సూచించాడు శ్రీశాంత్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకి రోహిత్ శర్మ లాంటి నాయకుడు కావాలి. సంజు శాంసన్ కు నిలకడలేదు. జట్టులో సంజు తో పాటు చాలామంది ఆటగాళ్లను మార్చాలి నేను రాయల్స్ కి ఆడేటప్పుడు కెప్టెన్ వ్యూహాత్మకంగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు సంజు అలా చేయట్లేదు. జాస్ బట్లర్ కెప్టెన్గా బాధ్యతలు చేపడితే బెటర్ అంటూ శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.