కుల్దీప్ అరుదైన రికార్డు.. వరల్డ్ క్రికెట్ లో ఒకే ఒక్కడు?

praveen
భారత జట్టులో చైనామన్ బౌలర్ గా కొనసాగుతున్న కుల్దీప్ యాదవ్ కెరియర్ ప్రస్తుతం  ఊపందుకుంది అన్న విషయం తెలిసిందే. గతంలో ఇక ఎన్నోసార్లు టీమ్ ఇండియాలో ఛాన్స్ కోసం ఎదురు చూసినప్పటికీ సెలెక్టర్లు అతన్ని పక్కన పెడుతూనే వచ్చారు. అయితే గత కొంతకాలం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ ఉండడంతో.. ఇక టీమిండియాలో చోటు కల్పించారు. మొన్నటికీ మొన్న ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో కూడా కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ బౌలర్.. తన స్పిన్ బౌలింగ్ మాయాజాలంతో అదరగొట్టేసాడు.

 వరల్డ్ కప్ టోర్నీలు మంచి గణాంకాలు నమోదు చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక మరోసారి తన ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టి20 జట్టులో చోటు దక్కించుకున్నాడు కుల్దీప్ యాదవ్. ఇక ఇటీవలే సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెరియర్ లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 2.5 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ యాదవ్.. 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

 కాగా t20 ఫార్మాట్ లో కుల్దీప్ యాదవ్ కు ఇదే అత్యుత్తమ ఘనంగాలు అని చెప్పాలి. ఇందులో విశేషం ఏంటంటే అతని పుట్టినరోజునే ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం గమనార్హం.  అయితే అంతర్జాతీయ క్రికెట్లో బర్త్ డే రోజే ఐదు వికెట్లు తీస్తున్న మొదటి బౌలర్గా కుల్దీప్ యాదవ్ రికార్డు సృష్టించాడు. డిసెంబర్ 14వ తేదీన కుల్దీప్ యాదవ్ 29వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇలా తన బర్త్ డే రోజే ఏకంగా అత్యుత్తమ ప్రదర్శన చేసి అభిమానులందరికీ కూడా ఒక మంచి ట్రీట్ ఇచ్చాడు కుల్దీప్ యాదవ్. కుల్దీప్ తర్వాత పుట్టినరోజు నాడే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ళలో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక ఆటగాడు హసరంగా కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: