కెప్టెన్సీ మార్పు.. ముంబై ఇండియన్స్ కు షాకిచ్చిన రోహిత్ ఫ్యాన్స్?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఇటీవల  షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టేస్తుంది. ఏకంగా సారధ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించి.. ఇక టీంలో ఒక సాదాసీదా ఆటగాడిగా మార్చేసింది. ఏకంగా ఏరి కోరి మరియు గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి అతని చేతిలో సారాధ్య బాధ్యతలను పెట్టింది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం. అయితే రోహిత్ శర్మ ఇలా రిటైర్మెంట్ ప్రకటించకుండానే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకోవడంపై అటు రోహిత్ ఫ్యాన్స్ అందరు కూడా మండిపడుతున్నారు.

 ఎందుకంటే ఇన్నాళ్లపాటు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ కి మద్దతు తెలిపిన అభిమానులు చాలామంది ఉన్నారు. ఇక రోహిత్ శర్మ ఆడుతున్నాడు కాబట్టే.. ముంబై ఇండియన్స్ మ్యాచ్లను చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా అలాంటి రోహిత్ శర్మనే కెప్టెన్ గా తప్పించారు అన్న విషయం తెలిసి ఫ్యాన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు. అంతేకాదు ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం తీసుకుందో లేదో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆ ఫ్రాంచైజీకి ఊహించని షాక్ ఇచ్చారు.

 ఏకంగా కొత్త కెప్టెన్ ను ప్రకటించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాను ఏకంగా నాలుగు లక్షల మంది అన్ ఫాలో చేశారు అని చెప్పాలి. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. అంతేకాదు షేమ్ ఆన్ ముంబై ఇండియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. రోహిత్ ముంబై ఇండియన్స్ కోసం ఎంతో చేశాడని కానీ ఆ జట్టు యాజమాన్యం మాత్రం అతని సేవలకు తగిన గుర్తింపును గౌరవాన్ని ఇవ్వలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్. ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: