హీరోయిన్ శ్రీ లీల నుంచి.. ఎంతో స్ఫూర్తి పొందా : మృణాల్

praveen
సీతారామం అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరించిన మృనాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతల దగ్గర అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సీతారామం మూవీ ద్వారా ప్రతి ఇంట్లో అమ్మాయిగా మారిపోయింది. అయితే ఇక ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని చెప్పాలి.  అయితే ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో కూడా బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

 ఈ క్రమంలోనే ఏకంగా బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా మృనాల్ ఠాగూర్ సిద్ధమవుతోంది అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఎన్నో హాట్ ఫొటోస్ ని పోస్ట్ చేసి కుర్ర కారు మతి పోగుడుతూ ఉంటుంది ఈ సొగసరి. ఇక ఇటీవల హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాని హీరోగా నటించగా.. తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఏ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీలో మృనాల్ ఠాగూర్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

 అయితే ఇటీవలే హాయ్ నాన్న సినిమా చూసిన యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీ లీల ఈ మూవీపై ప్రశంసలు కురిపించింది. ఇది ఒక ఎమోషనల్ మూవీ. నాని మృనాల్ అందరి హృదయాలను దోచుకున్నారు అంటూ సోషల్ మీడియాలో స్పందించింది శ్రీ లీల. ఇక శ్రీ లీల పోస్ట్ పై స్పందించిన మృనాల్ ఠాగూర్.. ఈ సినిమా నీకు నచ్చినందుకు నేను సంతోషిస్తున్న.. నీ నుంచి ఎంతగానో స్ఫూర్తి పొందాను. ఒక వైపు చదువుకుంటూ.. మరోవైపు నటించడం అంత సులభం కాదు. నిన్ను చూసి గర్విస్తున్న అంటూ మృనాల్ ఠాగూర్ రిప్లై ఇవ్వగా.. మృనాల్  మాటలు సంతోషాన్ని ఇచ్చాయి అంటూమరో రిప్లై ఇచ్చింది శ్రీలీలా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: