రోహిత్ ప్రదర్శనపై.. శిఖర్ ధావన్ పోల్.. రిజల్ట్ ఏంటంటే?

praveen
ప్రస్తుతం భారత జట్టుకు సారథిగా మాత్రమే కాదు.. ఇక జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ  వరల్డ్ కప్ లో ఫుల్ స్వింగ్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఒకవైపు కెప్టెన్ గా తన వ్యూహాలతో ప్రత్యర్ధులను  బోల్తా కొట్టించడంలో సక్సెస్ అవుతూ ఉన్నాడు. ఏకంగా తన ఫీల్డింగ్ సెట్టింగ్స్ తోనే హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు  అని చెప్పాలి. అంతేకాదు ఇక సరైన సమయంలో సరైన వ్యూహాలు అమలు చేసి.. ప్రత్యర్థి టీమ్స్ పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు రోహిత్ శర్మ. కాగా ఇక ఈ వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగించిన టీమిండియా.. వరుస విజయాలతో ఇక ఫైనల్ లో అడుగుపెట్టింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల తర్వాత అటు భారత జట్టు వరల్డ్ కప్ లో ఫైనల్ అడుగు పెట్టడంతో.. కెప్టెన్ రోహిత్ శర్మ పై ప్రశంసలు వర్షం కురుస్తుంది. అతను కెప్టెన్గా జట్టును నడిపించే తీరు ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఎంతో మంది మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయంలో రోహిత్ ఏం చేయాలని అయితే లక్ష్యం పెట్టుకుని వస్తున్నాడో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నాడు అంటూ ఎంతో మంది ఆకాశానికి ఎత్తేస్తున్నారూ. ఓపెనర్ గా వచ్చి క్రీజులో ఉంటుంది తక్కువ సమయమే అయినా ఆ తక్కువ సమయంలోనే విధ్వంసం సృష్టించి జట్టుకు మంచి ఆరంబాలను అందిస్తున్నాడు.

 ఈ క్రమంలోని రోహిత్ కెప్టెన్సీ పై వ్యక్తిగత ప్రదర్శన పై కూడా ఎంతోమంది మాజీలు సీనియర్ క్రికెటర్లు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఓపెనర్ గా వచ్చి టీమిండియా కు ప్రతి మ్యాచ్ లో కూడా శుభారంబాన్ని అందిస్తున్న రోహిత్ ప్రదర్శన పై ఇక భారత జట్టు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోల్ నిర్వహించారు. 2019, 2023 వరల్డ్ కప్లలో రోహిత్ పర్ఫామెన్స్ ఎందులో బాగుంది తెలపాలి అంటూ కోరాడు. అయితే 2019 వరల్డ్ కప్ కంటే 2023 వరల్డ్ కప్ లోనే రోహిత్ ప్రదర్శన, కెప్టెన్సీ బాగున్నాయని నేటిజన్స్ ఎక్కువ ఓట్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: