టైమ్డ్ ఔట్ వివాదం.. షకీబ్, మాథ్యూస్ రియాక్షన్ ఇదే?
ఆటగాళ్లతో పోటీపడి గెలవాలి తప్ప ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న రూల్స్ లోనే లోసుగులను ఉపయోగించుకొని గెలవడం ఏంటి అని ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది రూల్స్ ప్రకారమే అతను అలా చేశాడు అందులో తప్పేముంది. అలాంటప్పుడు ఐసీసీ రూల్స్ ని తప్పు పట్టినట్లే కదా అంటూ షకీబ్ కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవలే మ్యాచ్ లో టైం అవుట్ మాత్రం ఒక వివాదంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా టైం అవుట్ వివాదంపై బాధితుడు శ్రీలంక ఆల్రౌండర్ మ్యాథ్యూస్, బంగ్లాదేశ్ కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇన్ని రోజుల వరకు షీకిబ్ ఆల్ హసన్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. బంగ్లాదేశ్ జట్టు ఘోర తప్పిదం చేసింది. నిజంగా ఇది చాలా అవమానకరం నేను 110 సెకండ్లకే క్రీజ్ లోకి వచ్చాను. వీడియో కూడా సాక్ష్యం ఉంది త్వరలో ఆ వీడియోను కూడా బయటపెడతాం అంటూ మాథ్యూస్ చెప్పుకొచ్చాడు.
ఇదే విషయం గురించి షకీబ్ స్పందిస్తూ.. క్రీజ్ లోకి మాథ్యూస్ లేటుగా వచ్చారు. నేను అప్పీల్ చేస్తే అతను అవుట్ అవుతాడని ఫీల్డర్ చెప్పడంతో ఎంపైర్ ని కోరాను. Out గా ఇచ్చాడు. అయితే ఇది సరైనదో కాదు నాకు తెలియదు. కానీ నిబంధనల్లో ఇది కూడా ఒక రూల్ కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ షకీబ్ ఆల్ హసన్ చెప్పుకొచ్చాడు.