ఇది ప్రపంచ కప్ మ్యాచేనా.. బిసిసిఐపై తీవ్ర విమర్శలు?
ఈ క్రమంలోనే బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక సాదాసీదా దేశీయ లీక్ అయిన ఐపీఎల్ కు అటు ప్రారంభ వేడుకలతో పాటు ముగింపు వేడుకలు కూడా అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంటుంది బీసీసీఐ. కానీ ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లాంటి ఒక ప్రతిష్టాత్మక టోర్నీ భారత్ వేదికగా జరుగుతూ ఉంటే అటు ప్రారంభ వేడుకలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించింది అని చెప్పాలి. అదే సమయంలో అటు వరల్డ్ కప్ మ్యాచ్లకు ప్రేక్షకుల సందడి కూడా ఎక్కడ కనిపించడం లేదు. దీంతో బీసీసీఐపై వస్తున్న విమర్శలు రోజురోజుకు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పాలి.
భారత జట్టును తొలి మ్యాచ్ ఆడించకపోవడంతో పాటు.. ఇక ఆరంభోత్సవ వేడుక నిర్వహించకపోవడం కూడా ఇలా బీసీసీఐపై విమర్శలు రావడానికి కారణం అని చెప్పాలి. అదే సమయంలో వీక్ డేస్ లోను మ్యాచ్ టికెట్ ను తగ్గించకుండా భారీగానే ఉండడం.. ఇక స్కూల్ పిల్లలు, మహిళలకు కొంత శాతం టికెట్లు ఉచితంగా ఇవ్వకపోవడం బిసిసిఐ ఫెయిల్యూర్ గా అటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కారణంగా దాదాపు రూ. 20 వేలకు కోట్ల వరకు బీసీసీఐ కి ఆర్థిక ఊతం వస్తున్న బీసీసీఐ ప్రపంచక విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం దారుణంగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.