ఛాంపియన్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ.. ఎంఐ తగ్గేదేలే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ టీంగా కొనసాగుతుంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన టీం గా ఉన్న ముంబై ఇండియన్స్ ఎన్నో రికార్డులు కూడా కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు మరోసారి ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచి అభిమానులందరికి కూడా ఆనందంలో ముంచేస్తుంది అని చెప్పాలి. అదేంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడో అయిపోయింది కదా.. ఇప్పుడు కొత్తగా ముంబై ఇండియన్స్ టైటిల్ విన్నర్ గా నిలవడం ఏంటి అని కాస్త కన్ఫ్యూజన్లో పడిపోయారు కదా.


 ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ రావాలంటే పూర్తి స్టోరీ చదవాల్సిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో భాగమైన ఫ్రాంచైజీలు  అన్ని ఇతర దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న దేశీయ లీగ్ లలో కూడా జట్లను కొనుగోలు చేస్తున్నాయ్. ఈ క్రమంలోనే అటు ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ తో పాటు అటు అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో కూడా బాగమయింది. మేజర్ లీగ్ క్రికెట్లో న్యూయార్క్ జట్టును కొనుగోలు చేసింది అని చెప్పాలి. అయితే ఇక మేజర్ లీగ్ క్రికెట్ మొదటి సీజన్లోనే అటు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమను ఎందుకు ఛాంపియన్ అంటారు అన్న విషయాన్ని నిరూపించింది. ఎందుకంటే మొదటి ప్రయత్నంలోనే టైటిల్ విన్నర్ గా నిలిచింది అని చెప్పాలి.



 తొలి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచి చివరికి మేజర్ లీగ్ క్రికెట్ మొదటి సీజన్ విజేతగా నిలిచింది. ఇటీవల ఫైనల్ లో భాగంగా సీటల్ వోర్కాస్ తో మ్యాచ్ ఆడింది ఎంఐ న్యూ ఇయర్క్. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది   అయితే తొలుత బ్యాటింగ్ చేసిన సీటల్ వోర్కస్ 183/9 స్కోర్ చేయగా.. ఎమ్ఐ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది.కెప్టెన్ పూరన్ 55 బంతుల్లో 137 పరుగులు చేసి బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించడంతో ఎంతో అలవోకగా ఎంఐ న్యూయార్క్ జట్టు విజయం సాధించింది. . దీంతో ఫ్యాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: