కోహ్లీ గురించి ప్రశ్న.. రోహిత్ కు చిర్రత్తుకొచ్చింది?

praveen
టీమ్ ఇండియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ జట్టును గెలిపిస్తూ ఉంటాడు. కోహ్లీ బ్యాట్ నుంచి పేలవ ప్రదర్శన రావడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. అయితే మొన్నటి వరకు కోహ్లీ దాదాపు మూడేళ్ల పాటు వరుస వైఫల్యలతో ఇబ్బంది పడ్డాడు అన్న విషయాన్ని తెలిసిందే. ఈ క్రమంలోనే అత్యుత్తమ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కోహ్లీ పని అయిపోయిందని అతన్ని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఎంతో మంది విమర్శలు గుర్తించారు.
గుప్పించారు.
 అయితే ఆ తర్వాత కాలంలో మాత్రం విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్ లో అందుకుని సెంచరీల  మీద సెంచరీలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా చాలా రోజుల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ ఇలాంటి ప్రదర్శన చేస్తున్న మొన్నటి వరకు విరాట్ కోహ్లీ చేసిన పేలవ ప్రదర్శన గురించి అటు కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల మరోసారి మీడియా సమావేశంలో రోహిత్ శర్మకు ఇలాంటి ప్రశ్న ఎదురయింది. విరాట్ కోహ్లీ అడపా దడప సెంచరీలు చేయడం జట్టును ఆందోళన కురిచేస్తుందా అని రోహిత్ ను ఒక విలేకరి ప్రశ్నించింది.

 ఈ క్రమంలోనే ఈ ప్రశ్నతో చివరి చిర్రెత్తుకొచ్చిన రోహిత్ కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే ఎన్నోసార్లు సమాధానం చెప్పా. ఎవరు ఏం మాట్లాడుకున్నా మాకు అనవసరం. ఎవరు ఎంత స్కోర్ చేసారు ఎన్ని వికెట్లు తీసారని మాట్లాడుతూ ఉంటారు. అయితే జట్టులో అంతర్గతంగా ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు. అయినా బయట వాళ్ళు ఏదో అంటే మేము పట్టించుకోము. మాకు జట్టు లోపల ఏం జరుగుతుందని ముఖ్యం. గెలవటం  పైన అదృష్ట ఉంటుంది. అంతేకానీ బయట ఏం మాట్లాడుతున్నారు అన్న విషయం పట్టించుకోము. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్ పైనే మా దృష్టి ఉంది అంటు చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: