థర్డ్ ఎంపైర్ మందు కొట్టాడా ఏంటి.. ఆ మాత్రం కనిపించట్లేదా?
ఈ క్రమంలోనే ఇక అంపైర్ కళ్ళకు గంతలు కట్టుకున్నాడా ఏంటి.. బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మాత్రం అంపైర్ కు అర్థం కావట్లేదా అంటూ ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో జరిగింది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆస్ట్రేలియా 91 పరుగులు ఆదిఖ్యాన్ని సాధించింది. ఇకపోతే ఇటీవలే జరిగిన తొలి టెస్ట్ లోను మళ్ళీ ఒక వివాదాస్పద క్యాచ్ కాస్త వార్తలో నిలిచింది.
బెన్ డకేట్ ఇచ్చిన క్యాచ్ ని థర్డ్ స్లిప్ లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలకు తాకినట్లు క్లియర్గా ఉన్న థర్డ్ ఎంపైర్ మరోసారి అవుట్ గా ప్రకటించాడు. అయితే ఇటీవల స్మిత్ కూడా ఇలాంటి వివాదాస్పద క్యాచ్ తో వార్తల్లో నిలిచాడు. అయితే రూట్ పది పరుగులకు అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారిపోయింది. స్టార్కు వేసిన బంతిని రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద స్మిత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నేలకు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్ వెంటనే ఇక థర్డ్ అంపైర్ కు నివేదించారు. అయితే పలు కెమెరా యాంగిళ్ళలో ఇక క్యాచ్ను గమనించిన థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. దీంతో మరోసారి అంపైర్ల పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.