సొంత జట్టు కెప్టెనే.. కోహ్లీకి శత్రువుగా మారాడే?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆర్సిబి జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మంచి టచ్ లో కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు ఏకంగా నాలుగు అర్థ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. ఇక అతని దూకుడు ముందు ఎన్నో రికార్డులు కూడా బద్దలవుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇక ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించే ఆటగాళ్ల లిస్టులో మాత్రం మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.

 ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇక ఈ లిస్టులో టాప్ పొజిషన్ లో ఉంది ఎవరో కాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  కెప్టెన్ గా కొనసాగుతున్న డూప్లెసెస్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా కోహ్లీ లేదంటే ఫ్యాప్ డూప్లిసిస్ మంచి ప్రదర్శనలు చేస్తూ అదరగొట్టేస్తున్నారు. బెంగళూరు జట్టు తరఫున వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ జోడిగా కూడా ఇద్దరు నిలిచారు అని చెప్పాలి. అయితే ఇక్కడే విరాట్ కోహ్లీకి ఒక చిక్కు వచ్చి పడింది. సాధారణంగా అయితే కోహ్లీకి ఇతర జట్ల ఆటగాళ్లతో పోటీ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకోవడానికి అటు సొంత జట్టు కెప్టెన్ తోనే పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది.

 కాగా ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న పాప్ డూప్లెసెస్ ఇప్పటివరకు 300 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఆరు మ్యాచ్లు ఆడిన ఫ్యాబ్ డూప్లెసెస్ 68 సగటుతో 343 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 4 అర్థ సెంచరీలు వచ్చాయి అని చెప్పాలి. 166 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 279 పరుగులతో మూడవ స్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్ మాత్రం285 పరుగులతో రెండవ స్థానాల్లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. మరి ఇలా సొంత జట్టు కెప్టెన్ తోనే పోటీపడి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ సాధిస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: