ఐపీఎల్ : అన్ని మ్యాచ్లు.. ఇలా జరిగితే ఎంత బాగుండు?

praveen
ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ భరితమైన క్రికెట్ మ్యాచ్ లకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న ప్రత్యర్ధులు సహచరులుగా మారిపోవడం... ఇక సహచరులు ప్రత్యర్ధులుగా మారిపోయి ఒకరితో ఒకరు పోటీ పడటం ఐపీఎల్లోనే చూసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్ల కంటే అటు ఐపీఎల్ మ్యాచ్ లని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకులకు కావాల్సిన ఉత్కంఠ మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దొరుకుతూ ఉంటుంది అని చెప్పాలి.

 ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఒక జట్టు మరో జట్టుపై పైచేయి సాధించడం కాదు.. నువ్వా నేనా అన్నట్లుగానే చివరి బంతి వరకు కూడా ఎంతో ఉత్కంఠ భరితమైన పోరు సాగుతూ ఉంటుంది. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో మాత్రం కొన్ని మ్యాచ్లు మాత్రమే అటు ఉత్కంఠ భరితంగా సాగాయి. మిగతా అన్ని మ్యాచ్లు కూడా ఇక ఎవరు విజేత అన్న విషయం కొన్ని ఓవర్ల ముందుగానే తేలిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఉత్కంఠ అంటే ఇలా ఉండాలి అనే విధంగా.. అటు కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అని చెప్పాలి.

 ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 204 పరుగులు చేసింది. దీంతో 205 పరుగుల భారీ టార్గెట్ తో కోల్కతా జట్టు బరిలోకి దిగింది. ఇక తక్కువ సమయంలోనే వికెట్లు పడిపోయాయి. ఇక మధ్యలో రషీద్ ఖాన్ హ్యాట్రిక్  తీయడంతో కోల్కతా పని అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. ఇక అంతలోనే క్రీజు లోకి వచ్చిన రింకు సింగ్ సిక్సర్, ఫోర్ తో చెలరేగడంతో కోల్కతా గెలిచే ఛాన్స్ ఉన్నట్టుందే అని ఆశలు చిగురించాయి. చివరి ఓవర్ లో 29 పరుగులు కావాలి. ఇంకేముంది కోల్కతా ఓడిపోవడం పక్క అని కొంతమంది అభిమానులు ఫిక్స్ అయ్యి టీవీ ఆఫ్ చేశారు కూడా. కానీ రింకు సింగ్ చివరి ఓవర్ లో విధ్వంసం సృష్టించాడు. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి గెలిపించాడు. చివరి బంతి వరకు కూడా  ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ఇది చూశాక అన్ని మ్యాచ్లు ఇలా జరిగితే ఎంత బాగుండు అని క్రికెట్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: